Home  »  TV News  »  Karthika Deepam :మాలిని ఆఫర్ తిరస్కరించి హీరో అనిపించుకున్న సూరజ్!

Updated : Jul 17, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం '('Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -724 లో..... జ్యోత్స్న పారిజాతం ప్లాన్ రివర్స్ కొట్టాలని కార్ బాగుంది కండిషన్ లో ఉంది.. మీరు వెళ్లొచ్చని సూరజ్ చెప్తాడు. దాంతో పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు బయటకి వెళ్తారు. బ్రేక్ పని చెయ్యకపోవడంతో కార్ కి ఆక్సిడెంట్ చేస్తుంది జ్యోత్స్న. జ్యోత్స్నకి ఏం దెబ్బలు తగలవు కానీ పారిజాతానికి మెడలు పట్టేస్తాయి. మెడకి పట్టి కట్టుకొని పారిజాతం ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందని శివన్నారాయణ అంటాడు. నాకు ఎందుకో డౌట్ వస్తుందని కార్తీక్ అనగానే నీకు అన్ని డౌట్స్ వస్తాయిరా అని పారిజాతం అంటుంది.

అదంతా పక్కన పెట్టి ముందు కాంపిటీషన్ కి వెళ్ళడానికి రెడీ అవ్వండి అని శివన్నారాయణ అంటాడు. అందరు వెళ్ళాక పారు జ్యోత్స్నతో కార్తీక్ మాట్లాడతాడు. నువ్వు అంత అనుమానంగా చూడకని పారిజాతం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాంపిటేషన్ లో దీప విన్ అయ్యాక మీ సంగతి చెప్తానని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ కుటుంబంతో కాంపిటేషన్ దగ్గరికి వస్తాడు. మాలిని, దక్షిణామూర్తి కూడా వస్తారు. ఇక ఇద్దరు ఎదరుపడితే ఎప్పటిలాగే మాటలతో యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఒక ఛాన్స్ దొరకాలి గ్రానీ ఆ దీపని సూరజ్ ని అందరి దృష్టిలో బ్యాడ్ చేయడానికి అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే మాలిని వెళ్తుంటే తన ఉంగరం కిందపడుతుంది అది సూరజ్ చూసి తనకి ఇస్తాడు. అదంతా చూసి గ్రానీ నువ్వు వెళ్లి మాలినితో సూరజ్ చేతులు కలుపుతున్నాడని తాతయ్యకి చెప్పమని జ్యోత్స్న అంటుంది.

దాంతో పారిజాతం వెళ్లి అదే విషయం చెప్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్లడం వద్దు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని కార్తీక్ అంటాడు. అందరు వెళ్లి దూరం నుంచి వాళ్ళ మాటలు వింటారు. నా దగ్గర అడ్వైజర్ గా ఉండు ఎక్కువ జీతం ఇస్తానని మాలిని అంటుంది. నన్ను డబ్బుతో కొనలేరు నన్ను నమ్ముకున్న వాళ్ళకి మోసం చెయ్యనని సూరజ్ అంటాడు. ఆ మాటలు శివన్నారాయణ విని హ్యాపీగా ఫీల్ అవుతాడు. శభాష్ సూరజ్ అని మెచ్చుకుంటాడు. నా దగ్గర ఉన్న వాళ్ళని డబ్బు తో కొనలేరని శివన్నారాయణ గర్వంగా చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.